Amarnath: కూటమి పై మండిపాటు: అమర్నాథ్ సమీక్ష 1 y ago
AP : ఉత్తరాంధ్రను గాలికొదిలేశారన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోయారన్నారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావడం లేదన్నారు. విశాఖలోని రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, కూటమి అధికారంలోకి రాగానే బ్లూఫాగ్ హోదా రద్దయ్యిందని చెప్పారు.
ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందన్నారు. అధికారులను బలిపశువులను చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలు వాడుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి వైసీపీ మేలు చేసిందన్నారు. ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తోందని తెలిపారు. వైసీపీ నాయకులను బెదిరిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం అన్నారు.